మీ నోటి మాట చాలు.. డబ్బు ట్రాన్స్ ఫర్ అయిపోతుంది..

21 September 2023

హలో.. యూపీఐ.. రాజు కి 100 రూపాయలు పంపించు.. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? ఫోన్ లో మాట్లాడితే డబ్బులు వెళ్ళిపోతాయా అని

ఇవి పిచ్చి చేష్టలు అనుకుంటున్నారా? ఐతే మీరు తప్పులో కాలేసినట్టే. ఎలా ప్రెమెంట్స్ చేయవచ్చు. ఎలా అనుకుంటున్నారా..

ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ వాయిస్ కమాండ్ ద్వారా చేసే అవకాశం వచ్చేసింది. దీనినే వాయిస్ మోడ్ పేమెంట్ అంటారు.

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హలొ యూపీఐ సర్వీస్ ను ఆర్బీఐ గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో లాంచ్ చేసింది.

వాయిస్ ఫీచర్ లో ప్రస్తుతం హిందీ.. ఇంగ్లిష్ రెండు భాషల్లో పేమెంట్స్ చేయవచ్చు. మీ ఫోన్ లో మీరు కేవలం హలొ యూపీఐ అని చెప్పడం ద్వారా పేమెంట్ చేసేయవచ్చు.

ఏ బ్యాంకు ఎకౌంట్ తో మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉందొ ఆ నెంబర్ నుంచి ఈ వాయిస్ పేమెంట్స్ చేయవచ్చు.

లిస్ట్ లో ఉన్న ఏ బ్యాంక్ అయినా సెలక్ట్ చేసుకుని మీరు డబ్బులు పంపాల్సిన వ్యక్తి బ్యాంక్ పేరు.. ఆ వ్యక్తి పేరు చెప్పడం ద్వారా మీ పేమెంట్ చేయవచ్చు.

యూపీఐ పిన్ చెప్పడం ద్వారా మీ పేమెంట్ పూర్తి అయిపోతుంది. అయితే.. ప్రస్తుతం వాయిస్ మోడ్ తో పేమెంట్ చేయడానికి లిమిట్ 100 రూపాయలు మాత్రమే. త్వరలో ఇది పెంచవచ్చు.