అకౌంట్‌లో డబ్బులు లేకున్నా.. UPI పేమెంట్‌..

23 September 2023

భారత్ డిజిటలైజేషన్ మన జీవితంలోని దాదాపు ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది.యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రాకతో నగదు చెల్లింపుల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.

కూరగాయల నుంచి విమాన టికెట్ల వరకు ప్రతి చోట వినియోగదారులు మొబైల్ ద్వారా యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు.

ఇంటర్నెట్ ఉంటే చాలు.. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడైనా క్యాష్‌లెస్‌ పేమెంట్‌ చేయడానికి యూపీఐ తెగ ఉపయోగపడుతుంది.

ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్‌లకు ఫోన్ నెంబర్ లింక్ చేస్తే చాలు, ప్రతి ట్రాన్సాక్షన్ చిటికేలో అయ్యిపోతున్నాయి.

బ్యాంకులో తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, మొబైల్ నుంచి UPI ద్వారా పేమెంట్‌ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇప్పుడు UPI పేమెంట్ యాప్స్ ఉపయోగించి యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చు.

ఏ ప్రాంతంలోనైనా మర్చంట్‌ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేసి.. క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్స్‌ చేయవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా ట్రాన్సాక్షన్లకు కూడా అనుమతి ఇస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 4 న నిర్ణయం తీసుకుంది.

UPI వినియోగదారులు క్రెడిట్ లైన్ సౌకర్యం ద్వారా గూగుల్ పే, పేటీఎం, మొబిక్విక్‌, మొబైల్ బ్యాంకింగ్ UPI అప్లికేషన్‌ల్లో ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.