25 August 2024
Subhash
పెన్షన్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెన్షన్ అంశంపై కీలక ప్రకటన చేసింది.
పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్.
5 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
మ ఉద్యోగ సర్వీసులో 25 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పూర్తి పెన్షన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది కేంద్రం ప్రభుత్వం.
బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 11,12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇప్పుడు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ఉద్యోగులకు ఎంతగానో మేలు జరుగనుంది.