టీవీఎస్‌ నుంచి కొత్త స్కూటర్‌..న్యూ జూపిటర్‌ 110..దీని ధర ఎంతో తెలుసా?

23 August 2024

Subhash

దేశంలో కొత్త వాహనాల హవా కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కొత్త స్కూటర్లు, కార్లు అందుబాటులోకి వస్తున్నాయి.

కొత్త వాహనాల హవా

దేశీయ ప్రధాన ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్‌ మోటర్‌.. గురువారం తమ పాపులర్‌ మాడల్‌ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 

ద్విచక్ర వాహన తయారీ సంస్థ

టీవీఎస్‌ న్యూ జూపిటర్‌ 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉంది. 

ధర ఎంతో తెలుసా?

మున్ముందు మార్కెట్‌లో స్కూటర్లకు మరింత డిమాండ్‌ ఉంటుందని, దేశీయ ద్విచక్ర వాహన అమ్మకాల్లో స్కూటర్ల వాటా పెరుగుతుందని సంస్థ సీఈవో తెలిపారు.

స్కూటర్లకు మరింత డిమాండ్‌

త్వరలోనే ఇది ఇంచుమించుగా 40 శాతానికి చేరగలదని సంస్థ సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌ ఈ సందర్భంగా అంచనా వేశారు.

సంస్థ సీఈవో

ప్రస్తుతం టూవీలర్‌ అమ్మకాల్లో 32 శాతం స్కూటర్లవేనని తెలియజేశారు. నగరాలేగాక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు.

టూవీలర్‌ అమ్మకాల్లో

ఇక పరిశ్రమ వార్షిక చక్ర వృద్ధిరేటు 8 శాతంగా ఉంటే.. తమ సంస్థది 12 శాతంగా ఉందని సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌  చెప్పారు. 

సీఈవో కేఎన్‌ రాధాకృష్ణన్‌

రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు బాగుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త మాడళ్లను ఆవిష్కరిస్తామన్నారు.

రాబోయే పండుగ సీజన్‌లో