ప్రస్తుతం 'టీ' నుంచి మెుదలుకొని 'కారు' కొనడం వరకు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని సార్లు యూపీఐలు సరిగ్గా పనిచేయవు.
దాంతో కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎప్పుడైనా గూగుల్ పేలో చెల్లింపులు చేసే సమయంలో మీరు సమస్యలు ఎదుర్కున్నారా?
ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉన్న సర్వర్ బిజీ వల్ల ఎదుర్కొనే సమస్య. ఈ సందర్భంలో యూపీఐకి లింక్ అయ్యి ఉన్న ఇతర బ్యాంకులతో చెల్లింపులు చేయండి.
కొన్ని సార్లు డబ్బు డెబిట్ అవుతుంది కానీ అవతలి వారికి చేరదు. ఇటువంటి సందర్భాల్లో గూగుల్ పే కొన్ని సెకన్లలలోనే ఖాతాకు రీఫండ్ చేస్తుంది.
లేని సందర్భాల్లో 48 గంటల్లో డబ్బులు తప్పనిసరిగా మీ అకౌంట్లోకి చేరుతాయి. లేని పక్షంలో ఆ లావాదేవికి సంబంధించిన టికెట్ జనరేట్ చేయాలి.
గూగుల్ పేలోని ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్లండి. తర్వాత ఇష్యూస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. అనంతరం గూగుల్ పే ప్రతినిధి మీ సమస్యపై టికెట్ జనరేట్ చేస్తారు.
కొన్నికొన్ని సార్లు వినియోగదారులు పొరపాటున వేరే అకౌంట్లోకి డబ్బును పంపిస్తారు. అటువంటి వాటికి గూగుల్ పే బాధ్యత వహించదు.
వినియోగదారుడే సదరు ఖాతాదారుడిని తిరిగి ఆ డబ్బుని పంపమని కోరాలి తప్ప సంస్థ నుంచి ఎటువంటి సహకారం అందదు.