మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
25 October 2023
ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో తప్ప ఇతర ఫండ్లలో లాక్ ఇన్ పిరియడ్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేముందు చేసే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.
అన్ని మ్యూచువల్ ఫండ్లూ అందరికీ సరిపోవు. కాబట్టి ఎవరి అవసరాన్ని బట్టి వారు ఫండ్లు ఎంచుకోవాలి. రాబడి మాత్రమే ఆశించి కొన్ని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల పెట్టుబడిపై నష్టం కూడా రావచ్చు.
ముందుగా, మీ ఆర్థిక లక్ష్యాలను రాసుకోండి. లక్ష్యానికి ఎంత సమయం ఉంటే అంత తక్కువ మదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత ఉన్న లక్ష్యాల విషయంలో కాస్త రిస్క్ తీసుకున్నా పరవాలేదు.
పిల్లల చదువులు లాంటి లక్ష్యాల విషయంలో నష్టాలు రాకుండా చూసుకోవడమే మంచిది. ఇలాంటప్పుడు కాస్త తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లో అంటే బ్యాలన్స్‌డ్ ఫండ్లు లాంటి వాటిల్లో మదుపు చేయవచ్చు.
అలాగే లక్ష్యం 2-3 సంవత్సరాలు ఉండగానే ఈక్విటీ ఫండ్స్ నుంచి 70-80 శాతం వరకు మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌కు బదిలీ చేయొచ్చు లేదా బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకోవచ్చు.
మీ నెలవారీ ఖర్చుల్లో కనీసం 4 నుంచి 6 నెలలకు సరిపడా నిధిని ఒక లిక్విడ్ ఫండ్లలో మదుపు చేయండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. ఈ ఫండ్లలో బ్యాంకు పొదుపు ఖాతా కంటే 2-3 శాతం ఎక్కువ రాబడి వస్తుంది.
మీరు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు ప్రారంభించినట్లైతే ముందుగా ఒక ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇందులో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది. మంచి రాబడి పొందొచ్చు.
మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులు ఉంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్‌లైన్ పద్ధతి లో పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు.