పండక్కి బంగారం కొంటున్నారా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి..
09 November 2023
బంగారం విషయంలో మేకింగ్ ఛార్జీలు, ధరల పై అవగాహన లేకుండానే బంగారం కొనేస్తుంటారు. దీంతో తెలియకుండానే అధికంగా డబ్బు చెల్లిస్తుంటారు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బంగారం ధర ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. నిత్యం మారుతూనే ఉంటుంది. అందుకే ఆ రోజు ధర తెలుసుకోవాలి.
హడావిడిగా బంగారాన్ని కొనుగోలు చేయడం సరైన పద్ధతి కాదు. వేర్వేరు నగల దుకాణాలకు వెళ్లి ధరల్ని పరిశీలించండి.
నాణ్యత ఎలా ఉంది? మేకింగ్ ఛార్జీలు ఎంత మొత్తంలో విధిస్తున్నారు? వంటివి తెలుసుకొని, ఒకదానితో మరొకటి సరిపోల్చండి.
మీకు ఏ నగలు దుకాణంలో తక్కువ అనిపిస్తే అక్కడే కొనుగోలు చేయండి. ఒక షాపులోనే చూసి తీసుకంటే మాత్రం నష్టపోతారు.
బంగారం ధరకు, మీరు కొనే నగ ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం మేకింగ్ ఛార్జీలు అందులో కలుపడమే.
సాధారణంగా మేకింగ్ చార్జీలు 6 నుంచి 20 శాతం వరకు ఉంటాయి. మెషీన్‌తో తయారు చేసే జువెలరీ, తక్కువ డిజైన్ ఉన్న నగలకు మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి.
అందుకే సరళమైన డిజైన్ ఎంచుకోవటం మంచిది. చాలా మంది సేల్ సమయంలో మేకింగ్ ఛార్జీలపై రాయితీలు, డిస్కౌంట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు మేకింగ్ ఛార్జీలపై బేరమాడటం మేలు