యువత, మిలీనియల్స్ అవగాహన లేకుండా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఆర్థిక నష్టాలకు గురికాక తప్పదు. అందుకే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ప్రారంభించడానికి ముందే రిసెర్చ్ చేయాలి.
ఇందులో ఎదురయ్యే చిక్కులను, నష్టాలను తగ్గించడానికి, రాబడి అవకాశాలను పెంచడానికి మార్గాలను తెలుసుకోవాలి. అవసరమైతే ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్స్ సలహాలు తీసుకోవాలి.
పెట్టుబడి, రిస్క్ ఒకేచోట ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ ఎంత ఎక్కువగా ఉంటే, రాబడి శాతం అంత ఎక్కువ. అందుకే మీరు రిస్క్ టాలరెన్స్‌ను ముందు అర్థం చేసుకోవాలి.
ఇన్వెస్టర్ ఏదో ఒక మార్గంలోనే మొత్తం నిధులను పెట్టుబడి పెడితే, మార్కెట్ అస్థితర పరిస్థితుల్లో పూర్తిగా నష్టపోవచ్చు. అందుకే రిస్క్‌ను డైవర్సిఫికేషన్ చేయాలి.
కొంత మొత్తం కార్పొరేట్ బాండ్స్, సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, స్టార్టప్ ఈక్విటీ, CRE వంటి అసెట్ క్లాసెస్‌లో పెట్టుబడులను విస్తరించాలి. ఫలితంగా రిస్క్ ఎక్స్పోజర్ తగ్గుతుంది.
25 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి సిప్‌లు స్టార్ట్ చేయాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌ని 'సిప్' అంటారు. ఆ వయస్సుకి వారికి ఉద్యోగాలు వస్తాయి కదా. ఆలస్యం చేయకూడదు.
తక్కువ వయస్సులో సిప్
ను మొదలుపెట్టి.. నిలకడగా దానిని ముందుకు తీసుకెళితే.. అద్భుతాలను సృష్టిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడులు ఇన్వెస్టర్లకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. దీంతో లాంగ్ టర్మ్‌లో నిర్ణీత రాబడి కచ్చితంగా అందుతుంది.