తక్కువ వ్యవధి పెట్టుబడి కోసం ఈ ఫండ్స్ బెస్ట్ అప్షన్
22 October 2023
ఎవరైనా ఒక్క సంవత్సరం కోసం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఒక్క సంవత్సరం పెట్టుబడి పెట్టాలని అనుకునే వారి కోసం 2023 లో ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.
లిక్విడ్ ఫండ్స్: ఇవి సేవింగ్స్ ఎకౌంట్స్ కి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. లిక్విడ్ ఫండ్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో సాధారణంగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి 91 రోజుల మెచ్యూరిటీ తో ఉంటాయి.
అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ - అదనంగా మనవద్ద ఉన్న డబ్బును కొద్దికాలం పాటు ఉంచడానికి ఈ ఫండ్స్ పనిచేస్తాయి. వీటిని అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని కూడా అంటారు.
ఈ ఫండ్ 3-6 నెలల మధ్య మెచ్యూరిటీ వ్యవధితో సెక్యూరిటీలలో పెట్టుబడి పెడుతుంది. అంతేకాకుండా, ఈ ఫండ్‌లు తగినంత లిక్విడిటీతో సహేతుకమైన రాబడిని అందిస్తాయి.
షార్ట్ టర్మ్ ఫండ్స్: ఇవి 6 నుంచి 12 నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్. ఈ ఫండ్స్ ఎక్కువ వడ్డీ రేటు తో పాటు రిస్క్ కూడా కలిగి ఉంటాయి.
వీటిని ఫిక్స్డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. వీటిలో ఎప్పుడైనా ఎంట్రీ కావచ్చు.. ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. ఈ ఫండ్స్ 6-12 నెలల వరకు స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం తక్కువ-రిస్క్ పెట్టుబడిదారులకు అనుకూలం
మనీ మార్కెట్ ఫండ్స్ - మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒక సంవత్సరం మెచ్యూరిటీ వ్యవధితో సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. ఈ ఫండ్ పెట్టుబడులు సాధారణంగా స్థిర ఆదాయాన్ని సృష్టించే సెక్యూరిటీలలో ఉంటాయి.
ఇవే కాకుండా ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఫ్లోటర్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి కూడా సంవత్సర కాల వ్యవధి కోసం మంచి పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా దేనికి దానికి భిన్నమైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు.