ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైమ్‌ ఫ్రీ..ఫ్రీ..!

24 November 2023

క్రెడిట్‌ కార్డుల్ని వాడాలంటే జాయినింగ్‌ ఫీజుతో పాటు, రెన్యువల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. క్రెడిట్‌ కార్డు వాడినా వాడకపోయినా యేటా ఈ ఫీజులు ఇచ్చుకోవాల్సిందే

అయితే కొన్ని బ్యాంకులు క్రెడిట్‌ కార్డుల్ని ఉచితంగా అందిస్తున్నాయి. అంటే.. ఆ కార్డులపై ఎలాంటి వార్షిక రుసుము గానీ, రెన్యువల్‌ ఫీజులు గానీ వసూలు చేయవన్నమాట

ఈ కార్డులు పూర్తిగా లైఫ్‌ టైమ్‌ ఫ్రీగా వాడుకోవచ్చు. ఏయే బ్యాంకులు ఈ విధంగా ఉచిత క్రెడిట్‌ కార్డుల్ని అందిస్తున్నాయో ఆ వివరాలు మీ కోసం

ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఇచ్చే షాపర్స్‌ స్టాప్‌ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుని లైఫ్‌టైమ్‌ ఫ్రీగా వాడుకోవచ్చు. ప్రతి రూ.150 ఖర్చుకి ఆరు ఫస్ట్‌ సిటిజెన్‌ పాయింట్లు పొందొచ్చు

యాక్సిక్‌ బ్యాంక్‌ అందించే యాక్సిస్‌ మై జోన్‌ క్రెడిట్‌ కార్డ్‌ను లైఫ్‌టైమ్‌ ఫ్రీగా వాడుకోవచ్చు. స్విగ్గీలో ఒక్కో ఆర్డర్‌పై రూ.120పై డిస్కౌంట్‌ పొందొచ్చు. నెలకు రెండు సార్లు ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది

జాయినింగ్‌ ఫీజు, ఎలాంటి వార్షిక రుసుమూ లేకుండానే ఐసీఐసీఐ బ్యాంక్‌ అందించే అమెజాన్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డు వాడుకోవచ్చు. ఈ కార్డుతో అమెజాన్‌ 5 శాతం, నాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌కు 3 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది

ఐసీఐసీఐ ప్లాటినమ్‌ చిప్‌ క్రెడిట్‌ కార్డ్‌ కూడా ఉచితమే.. ఈ కార్డుతో ఇంధనం మినహా అన్ని రిటైల్ కొనుగోళ్లపై చేసే ప్రతి రూ.100 ఖర్చుపై 2 రివార్డ్ పాయింట్లు పొందొచ్చు

అలాగే కోటక్‌ 811 డ్రీమ్‌ డిఫరెంట్‌ క్రెడిట్‌ కార్డ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫార్చూన్‌ గోల్డ్‌ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యెస్‌ బ్యాంక్‌ ప్రాస్పరిటీ పర్చేజ్‌ క్రెడిట్ కార్డు వంటి పలు బ్యాంకులు లైఫ్‌ టైమ్‌ ఫ్రీగా ఇస్తున్నాయి