మీ ఆధార్‌తో ఏ మొబైల్ నంబర్‌ లింక్‌ చేయబడిందో తెలియదా? ఇలా తెలుసుకోండి

17 March 2024

TV9 Telugu

ఆధార్‌ అనేది భారత ప్రభుత్వం ద్వారా ప్రతి భారతీయు పౌరునికి అందించబడిన ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు. ఇది మీ గుర్తింపు కోసం ఉపయోగపడుతుంది.

ఆధార్‌ కార్డు

ఆధార్‌ కోసం మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయడం తప్పనిసరి. చాలా మంది ఏ మొబైల్‌ నంబర్‌ లింకైందో తెలియదు.

మొబైల్‌ నెం.

మీరు UIDAI అధికారిక అప్లికేషన్‌ mAadhaar నుంచి లింక్‌ చేసిన నంబర్‌ సులభంగా గుర్తించవచ్చు.

ఎలా కనుక్కోవాలి?

మీ స్మార్ట్‌ ఫోన్‌లో mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఆపై రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయండి.

mAadhaar అప్లికేషన్‌

ఇప్పుడు అప్లికేషన్‌ హోమ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ ఆధార్‌ చెల్లుబాటును తనిఖీ చేసి ఎంపిక చేసుకోండి.

ఆధార్‌ చెల్లుబాటు

ఆధార్‌ ఆప్షన్‌లో 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయండి. ఆపై క్యాప్చార్‌ కోడ్‌ను నమోదు చేసి సమర్పించండి.

ఆధార్‌ సంఖ్య

ఇప్పుడు మీరు ఫలితాన్ని చూస్తారు. మొబైల్‌ నంబర్‌ ఆధార్‌లో నమోదు చేస్తే దాని చివరి 3 నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మొబైల్‌నం.

దీని ద్వారా చివరి 3 అంకెలను చూడటం ద్వారా లింక్‌ చేయబడిన మొబైల్‌ నంబర్‌ను గుర్తించవచ్చు.

ఈ విధంగా గుర్తించండి