18 January 2024
TV9 Telugu
దేశంలో రోజురోజుకు కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి వివిధ కార్ల తయారీ కంపెనీలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు కస్టమర్లు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. ఇది నాలుగు రంగుల్లో లభించనుంది
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది
అటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్ తీసుకొస్తున్న ఈ కారు రూ.10.99 లక్షల నుంచి రూ.14.49 లక్షల లోపు లభించనుంది
రెండు బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ పంచ్..25 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 315 కిలోమీటర్లు ప్రయాణించనుంది
అలాగే 35 కిలోవాట్ల బ్యాటరీ మోడల్ సింగిల్ చార్జింగ్‌తో 421 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుందని కంపెనీ వర్గాల ద్వారా సమాచారం
స్మార్ట్ డిజిటల్, ఫోన్ చార్జింగ్, 366 లీటర్ల బూట్‌స్పేస్, వాయిస్ అసిస్టెంట్స్ రూఫ్‌టాప్ వంటి ఫీచర్స్‌తో రూపొందించింది. కేవలం 9.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం