27 September
Subhash
దేశీయంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మోటర్స్ సరికొత్త మాడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసింది.
నెక్సాన్ విభాగంలోనే సీఎన్‌జీ, సరికొత్త 45 కిలోవాట్ల బ్యాటరీతో నెక్సాన్ ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ నయా ఈవీ వేగవంతంగా చార్జింగ్ అవడమే కాకుండా పలు నూతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ మాడల్ రూ.13.99 లక్షల నుంచిరూ.17.19 లక్షల లోపు.
అలాగే నయా ఈ ఈవీ వాహనానికి టర్బోచార్జర్ సీఎన్‌జీ వాహనం 8.99 లక్షల రూపాయల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
దీంతో టాటా నెక్సాన్ అన్ని రకాలు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ విభాగంలో లభించిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం.
45 కిలోవాట్ల బ్యాటరీ ఉన్న ఈవీ మోడల్ సింగిల్ చార్జింగ్‌తో 350 నుంచి 370 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనుందని టాటా చీఫ్ కమర్షియల్ అధికారి వివేక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఏడేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నెక్సాన్ ఇప్పటి వరకు ఏడు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని అన్నారు.
ఇదే ఒరవడిని కొనసాగిస్తూ సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివేక్ శ్రీవాత్సవ చెప్పారు.