11 August 2024
Subhash
ఇప్పటికే టాటా మోటార్స్ నుంచి అనేక ఈవీలు విడుదలయ్యాయి. పంచ్, నెక్సాన్, టియాగో, టిగోర్ తదితర కార్లు పరుగులు తీస్తున్నాయి.
ఇప్పుడు టాటా నుంచి కొత్తగా కర్వ్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. దీని ధరను రూ.17.43 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.
ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 55 కేడబ్ల్యూహెచ్ లాంగ్ రేంజ్, 45 కేడబ్ల్యూహెచ్ మిడ్ రేంజ్ ప్యాక్ లను అందుబాటులో. ఈ కారు బుకింగ్‌లు ఆగస్టు 12వ నుంచి ప్రారంభం
క్రియేటివ్ వేరియంట్ లో 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ కారు రూ.17.49 లక్షలకు అందుబాటులో ఉంది.
అకాంప్లిష్డ్ వేరియంట్ లో రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. 45 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.18.49 లక్షలకు, 55 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.25 లక్షలకు లభిస్తుంది.
అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ లో 45 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.29 లక్షలకు, 55 కేడబ్ల్యూహెచ్ యూనిట్ రూ.19.99 లక్షలకు విక్రయిస్తున్నారు.
ఎంపవర్డ్ ప్లస్ కారు రూ.21.25 లక్షలకు అందుబాటులో ఉంది. దీనిలో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేశారు.
ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్ లో 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీని ధర రూ.21.99 లక్షలు.