Metro Ticket

12 August 2023

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌..  రూ.59కే అన్‌లిమిటెడ్‌ జర్నీ

Hyderabad Rail Ticket

భారతదేశపు 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికులకు ‘సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్‌ ఆఫర్‌’ ప్రత్యేక ఆఫర్‌

Metro Rail

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారంతంలో ప్రయాణికుల అనుభూతిని మరింతగా పెంచేందుకు ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు

Metro Offer

ఈ ఆఫర్ లో భాగంగా కేవలం 59 రూపాయలతో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా హైదరాబాద్‌ మొత్తం చుట్టేయచ్చు

ఈ సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు ద్వారా ఆగస్ట్ 12, 13, 15వ తేదీల్లో అపరిమిత మెట్రో రైడ్‌లను ఆస్వాదించవచ్చు

స్వాతంత్ర్య దినోత్సవ వారాంతంలో మెట్రో ప్రయాణాన్ని ఎంచుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రమోషన్ ప్రయత్నిస్తుందన్నారు మెట్రో ఎండీ

 మెట్రో రైల్‌ ప్రయాణికులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించడం కంటే భిన్నంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది

మా విలువైన కస్టమర్‌లకు ఈ ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌ఎఫ్ ఆఫర్‌ను అందిస్తుండటం పట్ల మేము సంతోషిస్తున్నామని అన్నారు మెట్రో ఎండీ, సీఈవో కెవిబి రెడ్డి 

ఈ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ హైదరాబాద్‌ నగరమంతా అన్‌లిమిటెడ్‌గా తిరిగేందుకు అవకాశం ఉంటుందని మెట్రో ఎండీ తెలిపారు