28 November 2023
మీరు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. మీరు లైఫ్ సర్టిఫికేట్ సమ ర్పించారా?
పెన్షన్ పొందడం కొనసాగించడానికి మీరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీని చివరి తేదీ నవంబర్ 30
మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు కేవలం రెండు రోజుల సమయమే ఉంది
మీరు ఇప్పటి వరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుంటే ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి
దీని కోసం మీరు బ్యాంకు మొబైల్ యాప్, వెబ్‌సైట్, లేదా డోర్ స్టెప్ సర్వీస్, టోల్ ఫ్రీనంబర్ ద్వారా చేసుకోవచ్చు
మీరు ఇంట్లో కూర్చోని కూడా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. మీరు జీవన్ ప్రమాణ్ పోర్టల్‌కు వెళ్లి ఈ పని పూర్తి చేయవచ్చు
జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించేందుకు ఆధార్ మాత్రమే అవసరం. బయోమెట్రిక్‌లను ధృవీకరించడం ద్వారా ఈ పని పూర్తి చేయవచ్చు
ఈ పద్దతుల ద్వారా నవంబర్ 30లోపు పెన్షన్ పొందుతున్న వారు లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం చాలా ముఖ్యం