14 December 2023
ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఆదాయం రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ. 355 లక్షల కోట్లకు చేరింది.
అమెరికా ఫెడ్ తీసుకున్న నిర్ణయం సూచీలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగడంతో పాటు భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు ఉంటుందని సంకేతాలతో భారీ లాభాలు
ఐటీ, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు మద్దతు కనిపించడంతో సెన్సెక్స్, నిఫ్టీ మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 70,146 పాయింట్ల వద్ద భారీ లాభాలతో కొనసాగింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 83.33గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు రాణించాయి.
అలాగే విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా రాణించాయి.
టెక్ మహీంద్రా (3.91%), ఇన్ఫోసిస్ (3.61%), విప్రో (3.52%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.97%) శాతం లాభపడ్డాయి.
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, టైటాన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.01%), నెస్లే ఇండియా (-1.04%), టైటాన్ (-0.32%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.29%), మారుతి (-0.29%) శాతం నష్ట పోయాయి.