01 March 2024
TV9 Telugu
దేశీయ మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్ కార్లు విడుదలవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో అందరికి దృష్టి ఈవీపైనే ఉంది.
అత్యాధునిక ఫీచర్స్‌తో భారత మార్కెట్లో రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల అవుతున్నాయి.
ఫ్రెంచ్‌నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా.. దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధమైంది.
2027లో భారత మార్కెట్లోకి ఈవీని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు మంగళవారం సదరు కంపెనీ ప్రకటించింది.
తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎన్యాక్‌ను ఈ ఏడాది భారత్‌లో పరిశీలించనుంది. ఈ-మొబిలిటీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
వచ్చే మూడేండ్లకాలంలో ఆరు మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెట్రా జనెబా తెలిపారు.
ఈ ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలోని ఉన్న ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
స్కోడా ఎలక్ట్రిక్ వాహనాలను 2027 సంవత్సరం నాటికి ఈ మాడల్‌ను తీర్చిదిద్ది విడుదల చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు.