2000 నోట్లపై ఆర్బీఐ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో రూ.2000 నోట్లను ఉపసంహరణకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే

ఆర్బీఐ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున నోట్లు బ్యాంకుకు వస్తున్నాయి

ఈ 2000 రూపాయల నోట్లను రద్దు చేసి నెల రోజులైంది

ఇప్పుడు ఈ చలామణిలో లేని నోట్ల గురించి ఆర్బీఐ కీలక విషయం తెలిపింది

 ఒక నెలలో 72 శాతం నోట్లు బ్యాంకుకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు

2000 నోట్లు రూ.2.41 లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయ్యాయి

ఈ నోట్లతో నగదు మార్పిడి, డిపాజిట్‌ రెండూ జరిగాయి

2000 నోట్లు దేశ ఆర్థిక వ్యవస్థపై  ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదన్నారు

ఈ విషయాలు జూన్ 26న పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్‌ వెల్లడించారు