లాభాల్లో ప్రారంభమైని స్టాక్‌ మార్కెట్

01 December 2023

పని ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా నేటి యువత టెన్షన్‌తో సతమతమవుతున్నారు. దీంతో అనేక రోగాలు వారిని చుట్టుముడుతున్నాయి

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 67,295 సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది

అమెరికా మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. డాలరుతో పోలిస్తే దేశీ రూపాయి మారకం విలువ 83.28 వద్ద ప్రారంభమైంది

ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు సెన్సెక్స్‌ 30 సూచీలో లాభాల్లో ఉన్నాయి

విప్రో, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి

ద్రవ్యోల్బణం దిగిరావడంతో నవంబర్‌లో యూఎస్‌ సూచీలు 2022 అక్టోబర్‌ తర్వాత మెరుగైన నెలవారీ లాభాలను నమోదుచేశాయి

బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గురువారం స్వల్పంగా తగ్గి 82.96 డాలర్లకు చేరింది

తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది