రైల్వే సంచలన నిర్ణయం.. ఈ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత

05 June 2024

TV9 Telugu

రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే శుభవార్త అందించింది. ఈ నిర్ణయంతో ఇంట్లో ఉండి కూడా జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

రైల్వే ప్రయాణికులకు

రైలు టికెట్‌ కోసం నిమిషాలకొద్ది క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా మరింత వెసులుబాటు కల్పించింది రైల్వే.

రైలు టికెట్‌ కోసం

రిజర్వేషన్ టిక్కెట్‌ను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నుండి బుక్‌ చేసుకున్నట్లే సాధారణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను ఇంట్లో కొనుగోలు చేయవచ్చు. 

రిజర్వేషన్ టిక్కెట్‌

అయితే గతంలో యూటీఎస్ యాప్‌ ద్వారా కేవలం  ఐదు కిలోమీటర్ల పరిమితికి మాత్రమే టికెట్ తీసుకునేందుకు ఉండేది. 

యూటీఎస్ యాప్‌

స్టేషన్ ఏరియా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు ఈ పరిమితిని రద్దు చేసింది రైల్వే. 

స్టేషన్ ఏరియా నుంచి

మీరు ఎంత దూరంలో ఉన్నారో బట్టి మీరు ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో రిజర్వేషన్ టిక్కెట్టు మాదిరిగానే జనరల్ టిక్కెట్‌ను యుటిఎస్‌లో కొనుగోలు చేయవచ్చు.

జనరల్ టిక్కెట్‌

యుటీఎస్‌ మొబైల్ యాప్‌లో Android, IOS, Windows ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

యుటీఎస్‌ 

బుకింగ్ లేదా వాలెట్ ఈ యాప్ ద్వారా టిక్కెట్ల కోసం చెల్లించడానికి ఉపయోగించవచ్చు. సాధారణ టిక్కెట్ల కోసం క్యూలైన్‌లో నిలబడటం కంటే మొబైల్‌లో టిక్కెట్లు కొనడం ఇప్పుడు సులభం.

బుకింగ్