6 అక్టోబర్ 2023
రూపే డెబిట్ కార్డు ఉన్న జన్ ధన్ ఖాతాదారులకు రూ. 2లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాతో పాటు డిసెబిలిటీ కవరేజీ ఉంటుంది.
రూపే ప్లాటినం డెబిట్ కార్డుపై అమెజాన్ పే, స్విగ్గీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పలు ఆఫర్లు ఉంటాయి.
రూపే క్లాసిక్ కార్డ్‌పై దేశీయ రైల్వే స్టేషన్లు, దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ చేయవచ్చు.
2 లక్షల రూపాయల వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్, పర్మనెంట్ డిసెబిలిటీ కవరేజి ఉంటుంది.
ఆ తర్వాత రకం కార్డు రూపే సెలెక్ట్‌పై అధిక ప్రయోజనాలు లభిస్తాయి. దేశీయ రైల్వే స్టేషన్లు, దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
20కిపైగా ప్రీమియం గోల్ఫ్ కోర్స్, కాంప్లిమెంటరీ గోల్ఫ్ గేమ్ యాక్సెస్ పొందొచ్చు. అలాగే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా పొందొచ్చు.
ఈ కార్డుపై జిమ్ మెంబర్‌షిప్ కూడా ఉంటుంది. ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. రూ. 10లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా, పర్మినెంట్ డిసెబిలిటీ కవరేజీ.
ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అకౌంట్ల కింద అందించే రూపే డెబిట్ కార్డు నిరుపేదలకు బాగా ఉపయోగపడింది.