13 March 2024
TV9 Telugu
భారత స్టాక్ మార్కెట్లో మార్చి 13 బ్లాక్ వెడ్నస్ డే గా నిలిచిపోతుంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా బుధవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయి.. చివరికి 900 పాయింట్ల నష్టంతో ముగిసింది.
ఇదే సమయంలో నిఫ్టీ 22 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. రిలయన్స్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ వంటి షేర్ల అమ్మకాలు సూచీల పతనం.
అలాగే అరెస్ట్ అయిన దుబాయ్ హవాలా ఆపరేటర్ దగ్గరున్న దాదాపు 11వందల కోట్ల విలువైన భారత స్టాక్స్ సీజ్ అయ్యాయి.
మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల అధిక విలువకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబ్ లేవనెత్తిన ఆందోళనలు.. ఇలా పలు కారణాలతో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోక తప్పలేదు.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 5 శాతం, మిడ్ క్యాప్ 4 శాతం నష్టపోవడంతో.. మదుపరుల సంపద దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.
బుధవారం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. 11 గంటల తర్వాతి నుంచి పతనమవుతూ వచ్చింది. ఇంట్రాడేలో 72,515.71 వద్ద కనిష్ట సూచీని తాకి.. చివరికి 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 338 పాయింట్ల నష్టంతో 21,997.70 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 85.85గా నమోదైంది.