28 December 2023
TV9 Telugu
రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఈ ఏడాది కొత్తగా లాంచ్ అయిన బైక్ హిమాలయన్ 450. 2023 మోటోవెర్స్ లో దీనిని ఆవిష్కరించింది.
ఈ ధరలు 2024 జనవరి ఒకటో తేదీ నుంచి పెరుగుతాయని కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బేస్ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 2.69లక్షలు ఉంది.
జనవరి ఒకటి నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ ధర 2.74 లక్షల రూపాయలకు పెరుగుతాయి.
అదే ప్రీమియం వేరియంట్స్ సమ్మిట్, హ్యాన్లే బ్లాక్ మోడల్స్ 2.79 లక్షల రూపాయలు. ధర పెరిగిన తర్వాత 2.84 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం
ఈ మోడల్స్ సేమ్ ఫీచర్లతో వస్తాయి. పెయింట్ స్కీమ్లలో మాత్రం మార్పులుంటాయి. అయితే పాత ధరలు ఈ డిసెంబర్ 31 వరకూ అందుబాటులు ఉంటాయి.
మీరు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా.. లేక షోరూంలో వెళ్లి ప్రీ బుక్ చేసుకున్నా.. ప్రారంభ ధరలే కొనసాగుతాయి. డిసెంబర్ 31 తర్వాత మాత్రం ధరలు పెరుగుతాయి.
వినియోగదారులు డిసెంబర్ 31కి ముందే బైక్ బుక్ చేసుకున్నా.. జనవరి ఒకటో తేదీ తర్వాత కలర్ ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే కొత్త ధర ప్రకారం నగదు చెల్లించాల్సి ఉంటుందని డీలర్లు ప్రకటించారు.
ఈ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ డిసెంబర్ 31లోపు కలర్ చేంజ్ కోసం ప్రయత్నిస్తే.. పాత ప్రారంభ ధరలే వర్తిస్తాయి.