30 రోజుల్లో కస్టమర్‌కు బ్యాంకులు పత్రాలు ఇవ్వకుంటే రోజుకు రూ.5 వేల జరిమానా

15 సెప్టెంబర్ 2023

లోన్‌ పొందినప్పుడు ఎంత సులభంగా పొందుతామో? తిరిగి చెల్లించాక వినియోగదారుడు బ్యాంకులో ఉంచిన పత్రాలను అంతే సులభంగా పొందవచ్చు

బ్యాంకు హోమ్ లోన్

ఇంటి పత్రాలు తిరిగి ఇవ్వడంలో వినియోగదారులు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్బీఐకి పలు ఫిర్యాదులు అందాయి

ఇంటి పత్రాలు

ఈ నేపథ్యంలో ఇంటి పత్రాలను పొందడంలో వినియోగదారుడు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది

ఇంటి పత్రాలు

హోమ్‌ లోన్‌ కోసం బ్యాంకులో ఉంచిన ఇంటి పత్రాలను సకాలంలో పొందేందుకు వినియోగదారులకు ఊరట కలిగించింది

హోమ్ లోన్ కోసం పత్రాలు

హోమ్‌ లోన్‌ ఈఎంఐ పూర్తిగా ముట్టిన తర్వాత కేవలం 30 రోజుల్లోనే పత్రాలు ఇచ్చేలా ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

30 రోజుల్లో ఇవ్వాలి

 ఒక వేళ పత్రాలు కస్టమర్‌కు 30 రోజుల్లో ఇవ్వకుంటే బ్యాంకులు రోజుకు రూ.5 వేల చొప్పున చెల్లించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది

రోజుకు రూ.5 వేల జరిమానా

ఒకవేళ ఆస్తి పత్రాలకు నష్టం వాటిల్లిన సందర్భంలో పాక్షికంగా లేదా పూర్తిగా రుణగ్రహీతకు రుణదాతలే ఆస్తి పత్రాల నకిలీ/సర్టిఫైడ్ కాపీలను పొందడంలో సహాయం చేయాలని ఆదేశం

బ్యాంకులదే బాధ్యత

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ కోసం బ్యాంకుకు అందించిన ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి ఈ నిబంధనలను జారీ చేసింది

ఆస్తి పత్రాలపై ఆదేశాలు