వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్.. ఆకట్టుకుంటున్న ఫుడ్ మెనూ..
25 December 2023
TV9 Telugu
గుజరాత్‌లోని సూరత్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ థీమ్‌తో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
మంచి యాంబియెన్స్‌తో నోరూరించే ఆహారం అందించే రెస్టారెంట్లకు ఆదరణ ఉంటూనే ఉంటుందని ఈ రెస్టారెంట్ మరోసారి చాటిచెప్పింది.
వేగానికి, ఆధునిక సౌకర్యాలకు పేరొందిన వందే భారత్ ట్రైన్‌కు తగ్గట్టుగానే రెస్టారెంట్‌లో ఆహారం వడ్డింపు.
వందే భారత్ థీమ్డ్ రెస్టారెంట్‌లో ఎన్నో డిష్‌లను వేగంగా సర్వ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు మేనేజ్మెంట్.
ఈ రెస్టారెంట్‌లో రెండు రకాల సూప్స్, ఏడు రకాల చాట్స్, పది రకాల కోల్డ్ సలాడ్స్, రెండు రకాల గార్లిక్ బ్రెడ్ వంటివి ఉన్నాయి.
అలాగే మూడు రకాల పిజ్జాలతో పాటు సౌతిండియన్, పంజాబీ ఫుడ్, అపరిమిత కూల్ డ్రింక్స్, ఎంచుకున్న ఓ డెజర్ట్‌ను ఆఫర్ చేస్తున్నారు.
ఈ రెస్టారెంట్‌లో లంచ్ మెనూ సగటు ధర రూ. 268 కాగా, డిన్నర్ సగటు ధర రూ. 289గా నిర్ణయించారు మేనేజ్మెంట్.
అందుబాటు ధరలను ఆఫర్ చేస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ థీమ్ రెస్టారెంట్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి