ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. 17 బ్యాంకుల లైసెన్స్ లు రద్దు

TV9 Telugu

07 January 2024

మీరు బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా? అయితే మీరు కచ్చింగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేందంటే సమస్య తప్పదు.

ఆర్బీఐ ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 సంవత్సరాల కాలంలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకుల లైసెన్సులను ఆర్‌బీఐ క్యాన్సిల్ చేసింది.

లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, శంకర్రావు పూజారి నూతన్ నగరి సహకారి బ్యాంక్ లిమిటెడ్, శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్‌ బ్యాంక్‌, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌ మొదలైనవి ఉన్నాయి.

ఆర్‌బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన 17 బ్యాంకులలో 6 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులే ఉన్నాయి. పనితీరు విషయంలో అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఆర్‌బీఐ లైసెన్స్ రద్దు చేసింది.

2022లో 12 సహకార బ్యాంకులు లైసెన్స్ క్యాన్సిల్ చేసిన రిజర్వ్ బ్యాంక్, 2023లో 17 బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది.

ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు చిన్న చిన్న బ్యాంకుల్లో కాకుండా పెద్ద బ్యాంకులలో దాచుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.

చిన్న బ్యాంకుల పనితీరు సరిగ్గా లేకపోయినట్లైతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా.