వచ్చే నెలలో ‍బ్యాంకుల బంద్‌! ఎన్ని రోజులంటే..

TV9 Telugu

26 January 2024

ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 18 రోజులు మాత్రమే పని చేస్తాయి. ఈ జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.

ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, సాధారణ సెలవులతో పాటు పండుగలు, ఇతర ప్రత్యేక దినోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

వచ్చే నెలలో దాదాపు 11 బ్యాంకులకి సెలవులు ఉంటాయి. బ్యాంక్ బ్రాంచ్‌ని సందరర్శించే పని ఉన్నవారు సెలవుల జాబితాను ఓ సారి చూసుకోవడం మంచిది.

ఫిబ్రవరి నెలలో నాలుగు ఆదివారాలు,  రెండు శనివారాలు.. విషయానికి వస్తే ఫిబ్రవరి 4, 10, 11, 18, 24, 25 తేదీలు సెలవులు.

ఫిబ్రవరి 14వ తేదీన బసంత్ పంచమి / సరస్వతి పూజ కారణంగా, త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 15వ తేదీన లూయిస్-నాగై-ని కారణంగా మణిపూర్‌లో, ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి కారణంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్ర దినోత్సవాన్ని కారణంగా మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో; ఫిబ్రవరి 26వ తేదీన న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

బ్యాంకులు మూతపడినప్పటికీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలను నిర్వహించవచ్చు.