కార్డు లేకున్నా స్కాన్ చేస్తే చాలు.. ఏటీఎం నుంచి డబ్బులు..
08 September 2023
స్మార్ట్ యుగంలో ప్రతి డబ్బుల వ్యవహారం డిజిటల్ రూపంలోకి మారుతున్నాయి. కార్డుతో పని లేకుండానే యూపీఐ ఆధారిత ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చేశాయి.
డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఏటీఎం నుంచి క్షణాల్లో డబ్బులు తీసుకోవచ్చు. కేవలం సెల్‌ఫోన్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు.
తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటి యూపీఐ-ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా.
ముంబైలో సెప్టెంబరు 5న నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023’లో ఈ యూపీఐ ఏటీఎంను ఆవిష్కరించారు.
జపాన్‌కు చెందిన సంస్థతో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ఏటీఎంను రూపొందించింది.
చేతిలో సెల్‌ఫోన్ ఆధారంగా యూపీఐ యాప్‌ల సాయంతోనే ఈ యూపీఐ ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చన్నమాట.
దీని కోసం యూపీఐ ఏటీఎం ‘యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఏటీఎం డబ్బులు పొందవచ్చు.
ఇప్పట్టినుంచి డబ్బులు విత్‌డ్రా యూపీఐ ఏటీఎం ద్వారా సురక్షితం, శ్రేయస్కారం అంటున్నారు బ్యాంక్ నిర్వహకులు.