రిలయన్స్- డిస్నీ ఇండియా విలీనం ఇక లాంఛనమే?
12 December 2023
భారత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన డిస్నీ ఇండియాకు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విలీనానికి సంబంధించి కొలిక్కి వచ్చిన చర్చలు
రెండు సంస్థల విలీనంతో ముకేశ్ అంబానీ అధ్వర్యంలో రిలయన్స్ యాజమాన్యం.. తన నియంత్రణ వాటా 51 శాతంతో అతిపెద్ద షేర్‌హోల్డర్ అవుతుంది
రెండు సంస్థల ఒప్పందంతో దేశంలోని అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో రిలయన్స్ మెజారిటీ వాటాదారుగా నిలవనుంది
విలీన సంస్థ బోర్డులో అటు రిలయన్స్, ఇటు డిస్నీకి సమాన ప్రాతినిథ్యం ఉంటుంది. రెండు సంస్థల నుంచి ఇద్దరేసి డైరెక్టర్లు ఉండనున్నారు
వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి విలీనం పూర్తి.. స్టార్ ఇండియాకు 77 ఛానళ్లు ఉండగా.. వయాకామ్‌కు 38 ఛానళ్లు ఉన్నాయి
డీల్ వచ్చే సంవత్సరం అంటే.. 2024 జనవరి నాటికి ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు
అయితే విలీన ప్రతిపాదనపై ఇప్పటివరకు ఈ రెండు సంస్థలూ ఎలాంటి అధికారిక ప్రతిపాదననూ చేయలేదు
అయితే విలీన ప్రతిపాదనపై ఇప్పటివరకు ఈ రెండు సంస్థలూ ఎలాంటి అధికారిక ప్రతిపాదననూ చేయలేదు