ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు ఎందుకు తిరస్కరిస్తారో తెలుసా..?

27 November 2023

ఆరోగ్య బీమా విషయంపై సంచలన నివేదికను పాలసీ బజార్ అనే భీమాకి సంబంధించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్ విడుదల చేసింది.

పాలసీ బజార్ ప్రకారం, 75 శాతం కేసులలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతున్నాయని తిలిపింది.

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో 18 శాతం వెయిటింగ్ పీరియడ్‌ని దాటకపోవడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.

16 శాతం కేసులలో, ప్రజలు కవరేజీతో నిమిత్తం లేకుండానే ఉండే వ్యాధుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ దావా వేస్తున్నారు.

OPD , డేకేర్ కోసం 9 శాతం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు చేయడం జరిగిందని పాలసీ బజార్ తన నివేదికలో పేర్కొంది.

4.5% హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తప్పుగా ఫైల్ చేసినట్లయితే తిరస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది.

పరిమితిని చేరుకున్నందున 2.12 శాతం హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు ఆమోదనికి నోచుకోవడం లేదని పాలసీ బజార్ పేర్కొంది.

గరిష్టంగా హెల్త్ ఇన్సూరెన్స్ 25% తిరస్కరణకు కారణం పాత వ్యాధులను దాచడమేనని పాలసీ బజార్ నివేదిక తెలిపింది.