29 December 2023
TV9 Telugu
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏడాదికేడాది వృద్ధి చెందుతోంది
హైదరాబాద్ నగరంలో గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది
దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ స్థితిగతులు, ఇండ్ల ధరలను ప్రామాణికంగా తీసుకొని నివేదికను రూపొందించింది
గత సంవత్సరం హైదరాబాద్‌లో 47,485 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది మొత్తం 61,715 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది
గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి నమోదైందని అనరాక్ పేర్కొంది. ప్రస్తుత నివేదికల ప్రకారం వచ్చే ఏడాదిలోనూ ఇండ్ల ధరలు 8-10 శాతం పెరిగే అవకాశం
ఖరీదైన గృహాల క్రయవిక్రయాల్లో దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్ ముందు వరుసలో నిలిచిందని నివేదికలు వెల్లడవుతున్నాయి.
ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్‌లో ముంబై అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో ఢిల్లీ నిలిచాయని నైట్ ఫ్రాంక్ నివేదిక
నివేదికల ప్రకారం 11 శాతం మేర ఇండ్ల ధరలు పెరిగినట్లుగా వెల్లడించింది. అత్యంత విలాసవంతమైన ఇండ్లకు హైదరాబాద్‌లో గణనీయంగా డిమాండ్