09 June 2024
TV9 Telugu
తక్కువ మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పీఐ లైట్‌లో (UPI lite) ఆటోమేటిక్‌గా డబ్బులు లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రతిపాదించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దీంతో పాటు ఫాస్టాగ్‌కు (Fastag) కూడా ఇదే విధానం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కు చెందిన సులభతరమైన వెర్షనే ఈ యూపీఐ లైట్ వ్యాలెట్‌లా పనిచేస్తుంది.
చెల్లింపులకు పిన్ అవసరం లేదు. గరిష్ఠంగా రూ.2000 వరకు లోడ్ చేసుకోవచ్చు. ఒకరోజులో రూ.2 వేలు మాత్రమే లావాదేవీలు చేయవచ్చు.
ఈ యూపీఐ వ్యాలెట్‌లో ఒకసారి గరిష్ఠంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసుకునే వెసులు బాటు ఉంటుందని గుర్తించుకోండి.
ఈ యూపీఐ లైట్ వ్యాలెట్‌లో నిర్దిష్ట లిమిట్ కంటే మొత్తం తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్స్ లోడ్ అవుతాయి.
యితే ఇందులో డబ్బులు ఆటోమేటిక్‌గా లోడ్ కావాలంటే ముందుగా లిమిట్‌ను యూజర్లే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.