ఈ మూడు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ.. కారణం ఏంటంటే

15  January 2024

TV9 Telugu

దేశంలోని మూడు బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా విధించింది. మూడు బ్యాంకులకు మొత్తం రూ.2.49 కోట్ల జరిమానా విధించింది. 

 జరిమానా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ జరిమానా విధించినట్లు సమాచారం.

నిబంధనలు ఉల్లంఘన

ధనలక్ష్మి బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ జరిమానా విధించింది.

 బ్యాంకులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇందులో ధనలక్ష్మి బ్యాంకుకు రూ.1 కోటి 20 లక్షలు జరిమానా విధించింది.

ఆర్బీఐ నిబంధనలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్దిష్ట రుణ నిబంధనలు, కేవైసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుకు జరిమానా విధించింది.

కేవైసీ

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు కోటి రూపాయల జరిమానా విధించింది. లోన్ సర్వీసింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా.

పంజాబ్‌ అండ్‌ సింద్‌

కస్టమర్ సర్వీస్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సెంట్రల్ బ్యాంక్‌కు 29 లక్షల 55 వేలు రూపాయలను జరిమానా విధించింది.

మార్కెట్లో..

ప్రతి బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలను పాటించాలి. వివిధ బ్యాంకింగ్ సేవలకు సంబంధించి బ్యాంకులు కొన్ని నిబంధనలను పాటించాలి. ఆ నిబంధనను ఉల్లంఘిస్తే ఆర్‌బీఐ జరిమానా విధిస్తుంది. 

ఆర్బీఐ రూల్స్‌