ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌కు ప్రత్యేక గుర్తింపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్.. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లలో ప్రథమ స్థానంలో నిలిచారు
అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో దాస్ ‘ఏ ప్లస్’తో టాప్‌లో ఉన్నారు
‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023’ పేరిట ఈ ర్యాంకులు విడుదలయ్యాయి
ద్రవ్యోల్బణం అదుపు, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీరేట్ల నిర్వహణ అంశాల ప్రాతిపదికన ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌లకు ఏ నుంచి ఎఫ్ వరకు గ్రేడ్‌లను ఇచ్చారు