ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ.. కారణం ఏంటో తెలుసా?

28 May 2024

TV9 Telugu

ప్రైవేట్ రంగ బ్యాంకులైన ఎస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) కొరడా ఝుళిపించింది.

ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన కారణంగా రెండు బ్యాంకులపై చర్యలు చేపట్టింది. 

రిజర్వ్‌ బ్యాంక్‌

ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank)కు రూ.కోటి, ఎస్‌ బ్యాంక్‌ (Yes Bank)కు రూ.91 లక్షల భారీ జరిమానా విధించింది.

భారీ జరిమానా

మార్చి 31, 2022 నుంచి బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తనిఖీలు నిర్వహించింది. 

ఆర్థిక పరిస్థితులపై

ఈ క్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలను పాటించడంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ పూర్తిగా విఫలమైనట్లు తేలింది. దీంతో చర్యలు చేపట్టింది.

బ్యాంక్‌ మార్గదర్శకాలు

ప్రాజెక్టు రిపోర్టులు, ఆర్థిక పరిస్థితులను పరిశీలించకుండానే పలు సంస్థలకు టర్మ్‌లోన్‌లు ఇచ్చినట్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని పలు నిబంధనల ప్రకారం చర్యలు.

ప్రాజెక్టు రిపోర్టులు

ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు కోటి రూపాయల జరిమానా విధించింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ).

 కోటి రూపాయల జరిమానా

అదేవిధంగా.. కస్టమర్ సర్వీస్, అంతర్గత, కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా ఎస్‌బ్యాంక్‌కు రూ.91 లక్షలు ఫైన్‌ వేసింది.

రూ.91 లక్షలు ఫైన్‌