ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ చార్జీలు వద్దు.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం

TV9 Telugu

05 January 2024

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తున్నారు.

బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది.చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి.

ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్‌ ఉండేలా నిర్వహించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది.

అయితే మినిమం బ్యాలెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయని ఖాతాలపై దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు చార్జీల మోతమోగిస్తాయి.

రెండేళ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్‌ ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ ఇక పై ఉండదు.

అలంటి ఖాతాలకి చార్జీలను వేయవద్దని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులను ఆదేశించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

స్కాలర్‌షిప్‌ నగదు కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం తీసుకున్న ఖాతాల్లో కొందమంది ఎలాంటి లావాదేవీలు జరిపారు.

రెండేళ్లకుపైగా ఎలాంటి లావాదేవీలు జరపకున్నా.. వాటిని ఇన్‌ ఆపరేటివ్‌ ఖాతాలుగా పేర్కొనరాదనీ స్పష్టం చేసింది.