ఏప్రిల్‌లో ఎన్నడూ లేనంతగా ఆర్‌బీఐ పసిడి కొనుగోలు.. 

TV9 Telugu

07 June 2024

భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా పసిడి కొనుగోలు చేసినట్టు నివేదికలు వెల్లడి.

ఆర్‌బీఐ ఈ ఏడాది ఏప్రిల్‌ మొత్తం 5.6 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దింతో ఇక్కడ పసిడి నిల్వలు 827.7 టన్నులకు చేరింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తాజా నివేదికలో ప్రపంచానికి వెల్లడించింది.

ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ ఏప్రిల్‌లో మొత్తం 33 టన్నుల పసిడి నిల్వలు కొనుగోలు చేసినట్టు పేర్కొంది.

అయితే మార్చి నెల విషయానికి కొస్తే ఇవి నికర విలువ 3 టన్నులు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది డబ్ల్యూజీసీ.

భారతీయ కేంద్ర బ్యాంక్‌ అయిన ఆర్‌బీఐ, ఈ ఏడాది జనవరి-మార్చిలో 24.1 టన్నుల పసిడిని కొన్నట్టు తెలిపింది.

గతంలో ఎన్నడూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంతగా బంగారాన్ని కొనలేదని తెలిపింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం నిల్వలు కలిగి ఉన్న దేశాల్లో జాబితాలో భారతదేశం 10వ స్థానంలో ఉందని తేలింది.