వచ్చేవారం మార్కెట్ లోకి IPOల క్యూ

17 December 2023

డిసెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ఫీవర్ నెలకొంది. చాలా కంపెనీలు ఇప్పటికే ఐపీఐకు వచ్చాయి. వచ్చే వారం కూడా మరి కొన్ని కంపెనీలు ఐపీఓను ఇష్యూ చేయనున్నాయి.

మైక్రో రుణ సంస్థ మూత్తూట్‌ మైక్రోఫిన్‌ కంపెనీ ఒక్కో షేరును రూ.277-291 ధరతో జారీ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.960 కోట్లు సమీకరించనుంది.

ప్రముఖ ఇంజనీరింగ్, ఫోర్జింగ్ కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ కంపెనీ ఒక్కోషేరు ధరల శ్రేణిని రూ.808-850గా నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్‌గా ఇష్యూ చేయనున్నారు.

ముఫ్తీ జీన్స్‌ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఒక్కోషేరు ధరలు శ్రేణిని రూ.266-280గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో భాగంగా రూ.550 కోట్లు సమీకరించనుంది.

ముంబయికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓ రానుంది. షేర్ ధరల శ్రేణి రూ.340-360గా నిర్ణయించారు. రూ.400 కోట్ల ఈ ఐపీఓలో ఫ్రెష్‌ షేర్లను జారీ చేయనున్నారు.

ప్రముఖ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ షేర్ ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయించారు. 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు.

ఆర్‌బీజడ్‌ జువెలర్స్‌ ఐపీఓ షేర్ ధరల శ్రేణిని రూ. 90-100గా నిర్ణయించారు. రూ.100 కోట్ల నిధులు సమీకరించేందుకు ఐపీఓకు వస్తుంది.

హైదరాబాద్‌ కు చెందిన అజాద్‌ ఇంజినీరింగ్‌ ఐపీఓ షేర్ ధరల శ్రేణిని ఒక్కొక్కటి రూ. 499-524గా నిర్ణయించారు. రూ.740 కోట్ల ఐపీఓలో రూ.500 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌, రూ.240 కోట్ల విలువైన షేర్లను ఫ్రెష్‌గా జారీ చేయనున్నారు.