సేవింగ్స్ ఎకౌంట్ క్లోజ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
06 September 2023
ఈ రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ ఎకౌంట్స్ ఉండడం సహజం. ఉద్యోగాలు మారినపుడు ఇలా ఎక్కువ ఎకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి.
ఇటువంటి పరిస్థితిలో పాత ఎకౌంట్ క్లోజ్ చేయడం మంచిది. అలా ఎకౌంట్ క్లోజ్ చేసేటపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో చూద్దాం.
ఏదైనా స్కీంతో ఇది లింక్ అయి ఉందేమో చెక్ చేసుకోని అవి ఆన్ లింక్ చేసిన తర్వాత మాత్రమే ఎకౌంట్ క్లోజ్ చేయండి.
మీరు క్లోజ్ చేస్తున్న ఎకౌంట్ కి ఏదైనా ఇన్సూరెన్స్, వెల్ ఫేర్ స్కీంలు వంటివి లింక్ అయి ఉంటె కనుక వాటికి సంబంధించిన రిఫండ్స్ ఆ ఎకౌంట్ కే వస్తాయి.
ఎకౌంట్ క్లోజ్ చేయడం వలన అవి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడాలి.
ఎకౌంట్ క్లోజ్ చేయడానికి ముందుగానే పెండింగ్ ఫీజులు.. ఈఎంఐ లు క్లోజ్ చేయండి. దీనివలన మీ క్రెడిట్ స్కోర్ పాడవకుండా ఉంటుంది.
ఒకవేళ ఈ ఎకౌంట్ నుంచి ఏవైనా పేమెంట్స్ కట్ అవుతూ ఉంటె కనుక వాటిని వేరే ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి