జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు..
04 December 2023
భార్యాభర్తలే కాదు.. కుటుంబ నిర్వహణలో పాలుపంచుకునే అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు కూడా జాయింట్ అకౌంట్‌ను ఎంచుకోవచ్చు.
ఇద్దరూ తమ జీతాల్లోంచి కొంత మొత్తాన్ని అందులో జమ చేస్తారు. ఇంటితో ముడిపడిన ప్రతి ఖర్చూ ఆ ఖాతా నుంచే చెల్లిస్తారు.
అద్దె, సరుకులు, సినిమాలు, బిల్లులు, సమస్తం ఇక్కడినుంచే చెల్లింపులు జరిపితే నెలకు ఇంత ఖర్చు అవుతుందన్న అన్న లెక్క ఉంటుంది.
ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా జాయింట్ అకౌంట్ పనికొస్తుంది. ఖాతాలో ఎంత సొమ్ము ఉందన్నది ఇద్దరికీ తెలుస్తుంది కాబట్టి, ఆ మేరకే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు.
జాయింట్ అకౌంట్ ప్రారంభించడానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక ఆప్షన్ ఎంచుకుంటే లావాదేవీ నిర్వహణకు ఇద్దరి సంతకాలు కావాలి.
అదే, ‘ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా బతికున్నవారు’ అనే అప్షన్ ఎంచుకుంటే.. ఖాతాలోని ప్రతి భాగస్వామికీ విత్‌డ్రా అధికారాలు ఉంటాయి.
దురదృష్టవశాత్తు, ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా కూడా మిగిలినవారికి ఆ ఖాతాలోని సొమ్ము మీద అధికారం ఉంటుంది.
ఆలూమగల అనుబంధానికే కాదు.. జాయింట్ అకౌంట్‌కూ నమ్మకమే ప్రాణం. ఏ ఒక్కరు పారదర్శకంగా లేకపోయినా.. విశ్వాసం దెబ్బతింటుంది.