15 September 2023

మీ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ సేఫ్ గా ఉండాలంటే.. 

భవిష్యత్ అవసరాల కోసం  ఇన్వెస్ట్ చేసిన డబ్బు విషయంలో ఎప్పుడూ ఆందోళన 

ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. 

ప్రతి ఇన్వెస్ట్మెంట్ కొంత స్థాయిలో రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేసేముందు తక్కువ రిస్క్ ఉన్నదానిని ఎంచుకోవాలి. 

 రిస్క్ మేనేజ్ చేసుకోవాలంటే.. మనం మన డబ్బు మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు. 

మొత్తం డబ్బు ఒకే దగ్గర పెట్టుబడి పెట్టకూడదు. రకరకాల ప్రాపర్టీస్.. సెగ్మెంట్స్.. లలో ఇన్వెస్ట్  చేయాలి. 

సులువుగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి.  దీనినే  డైవర్సిఫికేషన్‌ అంటారు. 

ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో టైం పిరియడ్ చాలా ముఖ్యం. కనీసం ఐదేళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది ఫలితాలను ఇస్తుంది.

 ఎటువంటి పరిస్థితిలోనూ మీ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ వదలవద్దు.  మార్కెట్ లో పరిస్థితి బాగోలేదని తొందర పడవద్దు. మీ ప్లాన్స్ నుంచి పక్కకు జరగొద్దు. 

ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయవద్దు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఎంత డిసిప్లిన్ తో వ్యవహరిస్తే అంత మంచిది. 

ఎదో కనిపించింది.. ఎవరో చెప్పారు.. అని పెట్టుబడులు పెట్టేయకూడదు. ఇన్వెస్ట్ చేసేముందు సంబంధిత ప్లాన్ విషయంలో రీసెర్చ్ చేయాలి. 

అన్నీ సరిగా ఉన్నాయనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.  మీ రీసెర్చ్ వల్ల పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనా, కాదా అని మీకు తెలుస్తుంది.