ఇల్లు కొంటున్నారా? చిన్నవే కదా అని ఈ విషయాల్లో అసలు తప్పు చేయకండి..

01 October 2023

ఇల్లు లేదా ఫ్లాట్ నిర్మాణ సమయంలో సిమెంట్.. ఇటుక.. ఇంటీరియర్ లో వాడే లైట్లు.. కలర్స్ ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  కానీ, బాత్రూమ్స్ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టరు.

నిజానికి ఇంటి నిర్మాణంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల్లో బాత్రూమ్స్ కూడా ఒకటి. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలసిన అంశాలు మూడు.

అందులో మొదటిది నీటి వాలు. బాత్రూమ్ లో వాడిన నీరు నేరుగా డ్రైనేజ్ పైపు లోకి జారిపోయే విధంగా ఉండేలా చూసుకోవాలి.

బాత్రూమ్ టైల్స్ అమార్చే సమయంలో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

బాత్రూమ్ టైల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు వాడటం.. అలానే సబ్బులు వాడటం వలన టైల్స్ మరీ నునుపుగా ఉంటే కనుక జారిపడే ప్రమాదం ఉంటుంది.

మూడో అతి ముఖ్యమైన విషయం బాత్రూమ్ ఫిటింగ్స్..వాష్ బేసిన్, కమోడ్, పైపులు, టాప్స్ వంటివి. సాధారణంగా వీటి విషయంలోనే బిల్డర్ లేదా కాంట్రాక్టర్ కక్కుర్తి పడతారు.

వాష్ బేసిన్.. కామోడ్ క్వాలిటీతో లేకపోతే.. వాటిని గోడలకు అమార్చే స్క్రూలు వంటివి సరైనవి కాకపోతే త్వరగా పాడై పోతాయి. తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

మంచి కంపెనీ పరికరాలే వాడుతున్నారా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక పైప్ లు.. టాప్ లు.. షవర్ వంటి వాటి క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు.

ఇంటి నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పని అప్పచెప్పే సమయంలోనే లేదా ఫ్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే ఈ విషయాలపై క్లారిటీగా చర్చించండి.

అవసరం అయితే మీరు ఏ కంపెనీ వస్తువులు వాడాలి అనుకుంటే అ కంపెనీల పేర్లు.. మోడల్స్ పేరు తో సహా అగ్రిమెంట్ లో చేర్చండి

ఇల్లు లేదా ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తరువాత ఎన్ని రోజులు వాటి విషయంలో వచ్చే ఇబ్బందులను కాంట్రాక్టర్ల లేదా బిల్డర్ సారి చేసే బాధ్యత తీసుకోవాలి అనే విషయంలోనూ క్లారిటీగా ముందే మాట్లాడుకోవాలి.