ఈ రైతులకు పీఎం కిసాన్‌ యోజన ప్రయోజనం ఉండదు.. ఎందుకో తెలుసా?

11 June 2024

TV9 Telugu

పీఎం కిసాన్‌ సమ్మన్‌ నిధి 17వ విడత త్వరలో విడుదల కావచ్చు. జూన్‌ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.

పీఎం కిసాన్‌

ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది కేంద్రం. ఇవి రూ.2000 చొప్పున మూడు వాయిదాల్లో అందిస్తోంది.

వాయిదాలు

పలుమార్లు లబ్ధిదారులు చిన్నపాటి పొరపాట్లతో రైతులకు డబ్బులు అందడం లేదు. ఈ తప్పులు చేస్తే ఈ పథకం సాయం పొందలేరని గుర్తించుకోండి.

చిన్న పొరపాట్లు

లబ్ధిదారుని బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా  ఉన్నట్లయితే వారు 17వ విడత డబ్బులు పొందలేరు.

వివరాలు తప్పులు

పీఎం కిసాన్‌ ప్రయోజన పొందుతున్న రైతులు తప్పకుండా కేవైసీ చేసుకోవడం చాలా ముఖ్యం. కేవైసీ పూర్తి చేసుకోకపోతే కూడా డబ్బులు అందవు.

కేవైసీ

మీరు పీఎం కిసాన్‌ పథకంలో పూర్తి కేవైసీ పూర్తి చేయకుంటే  మీ సేవా కేంద్రంలో గానీ, ఆన్‌లైన్‌లో చేసుకోవడం ఉత్తమం.

పూర్తి కేవైసీ

కేవైసీ పూర్తి చేసుకోని రైతులు వెంటనే ఈ పని చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. లేకుంటే 17వ విడత డబ్బులు అందుకోలేరని గుర్తించుకోండి.

కేవైసీ

అలాగే అనర్హులుగా ఉన్న రైతులు కూడా ఈ ప్రయోజనం పొందుతుంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న వాయిదాలు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది.

అనర్హులు