కష్టార్జితం సద్వినియోగం అవడానికి దాతృత్వం సహాయపడుతుందని మీకు తెలుసా..

30 November 2023

దాతృత్వం అనేది బలమైన పాజిటివ్‌ ఎమోషన్‌. పంచుకోవడంలోని ఆనందం అనిర్వచనీయం. దీనివల్ల మన జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది.

లేనివారితో పంచుకోవడం ఉన్నవారి బాధ్యత కూడా. కాబట్టే, ఆర్థిక మానసిక వేత్తలు దాతృత్వాన్ని ‘మానవీయ పెట్టుబడి’గా అభివర్ణిస్తారు.

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు దీర్ఘకాలంలో మన ఆస్తుల విలువను పెంచినట్టు.. విరాళాలు, దానాలు, సేవ.. హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో మన గ్రాఫ్‌ను పైపైకి తీసుకెళ్తాయి.

కాబట్టి తగిన ఎన్జీవోనే కాదు, ఆ సంస్థ కార్యకలాపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ సంస్థకు బతుకులను మార్చే శక్తి ఉంది.

ఎవరి చేతిలో పెడితే కనుక మీ కష్టార్జితం సద్వినియోగం అవుతుంది అనే కోణంలో ఆలోచించండి. మనకు సేద్యం ఉంటే, పంటలో కొంత భాగాన్ని పేదలకు పంచవచ్చు.

ఇన్‌కమ్‌టాక్స్‌ యాక్ట్‌-1961లోని సెక్షన్‌ 80 జీ ప్రకారం.. యాభై నుంచి నూరు శాతం పన్ను వినహాయింపు లభిస్తుంది. కానీ, ఆ విరాళం మన మొత్తం ఆదాయంలో పదిశాతానికి మించకూడదు.

అయితే, ఇక్కడో నిబంధన ఉంది. మనం విరాళం అందించిన సంస్థలకు 80 జీ రిజిస్ట్రేషన్‌ తప్పక ఉండాలి. అప్పుడే, నోటిఫైడ్‌ సంస్థల జాబితాలో చోటు లభిస్తుంది.

కొత్త టాక్స్‌ విధానాన్ని ఎంచుకునేవారికి ఈ మినహాయింపు వర్తించదు. పాత పద్ధతినే ఎంచుకున్నా.. రెండు వేల రూపాయలకు మించిన నగదు విరాళాలు ఈ పరిధిలోకి రావు.