గుడ్‌న్యూస్‌..త్వరలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయా? 

14 September

Subhash

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర 80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో పడిపోయింది.

క్రూడాయిల్‌

మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో వాహనదారుల ఊరట లభించనుంది.

ఊరట

ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు.

పెట్రోలియం శాఖ కార్యదర్శి

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర మూడేళ్ల కనిష్ఠానికి చేరింది. 2021 డిసెంబర్‌ తర్వాత బ్యారెల్‌ చమురు ధర మంగళవారం 70 డాలర్ల దిగువకు చేరింది. 

క్రూడాయిల్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్‌ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌+ దేశాలు భావిస్తుండగా.. ఉత్పత్తిని పెంచాలని భారత్‌ కోరుతోంది. 

ఆర్థిక వ్యవస్థ

మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్‌ ఆయిల్‌ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

రష్యన్‌

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను లీటరుకు రూ.2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. 

పెట్రోల్‌, డీజిల్‌

జమ్ము-కశ్మీర్, హర్యారా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి ధరలు తగ్గే అవకాశం

ఎన్నికలు