తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతకే ఆదరణ

08 December 2023

మార్కెట్లు, ఆన్‌లైన్‌, కూరగాయల దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు ఓటేస్తున్నట్లు లోకల్‌ సర్కిల్‌ సర్వేలో తేలింది.

కూరగాయలు, పండ్లు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారన్న అంశంపై దేశవ్యాప్తంగా 297 జిల్లాల్లో 24 వేల మంది వినియోగదారులను సర్వే జరిపారు.

61శాతం పురుషులు, 39 శాతం మహిళల నుంచి వివరాల ప్రకారం 66 శాతం వారాంతపు మార్కెట్లకు వచ్చి తాజా పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు

7 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నామని, 21 శాతం మార్కెట్లలో, 3 శాతం తోపుడు బండ్లు, 5 శాతం రిటైల్‌ దుకాణాల ద్వారా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.

కార్మికులు, దినసరి కూలీలు, ప్రైవేట్‌ ఉద్యోగులు, భవన నిర్మాణరంగ కార్మికులు వారాంతపు సంతలో కోనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులను సైతం వారాంతపు సంతలో కోనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు వారాంతపు సంత సాగుతుంది. ఆ సమయంలో అందరూ ఇళ్లల్లో ఉన్న కారణంగా కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది.

ఇంటి దగ్గర సంతలోనే అన్నీ దొరకడంతో వారాంతపు సంతలను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. సమయం, డబ్బు కూడా ఆదా అవుతుందని అన్నారు.