కుప్పకూలిన పేటీఎం షేర్లు

TV9 Telugu

03 February 2024

భారత్ స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లు ఢమాల్. రూ.9,600 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, రెండు రోజుల్లో 40 శాతం పడిన షేర్‌ ధర.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ఫలితంగా పేటీఎం షేర్లు తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం 487 రూపాయల దగ్గర షేర్‌ డ్రేట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఒక్క రోజే పేటీఎం షేరు 20 శాతం అంటే 121 రూపాయలు తగ్గింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ఫలితంగా ఫిబ్రవరి 1వ తేదీ కూడా పేటీఎం షేర్లు 20 శాతం వరకు పడిపోయింది.

జనవరి 31వ తేదీ 761 రూపాయలుగా ఉన్న ఒక్కో పేటీఎం షేరు ధర.. ఫిబ్రవరి 2వ తేదీన నాటికి 487 రూపాయలకు చేరింది.

ఎన్‌ఎస్‌ఈలో గురువారం (ఫిబ్రవరి 1న) 19.99% నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ రూ.609కు చేరి, అక్కడే ముగిసింది.

ఫలితంగా పేటీఎం మార్కెట్‌ విలువ రూ.9,646.31 కోట్లు ఆవిరై రూ.38,663.69 కోట్లకు పరిమితమైంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను మార్చి 1, 2024 నుంచి RBI నిలిపివేయాలని ఆదేశం

దీంతో పేటీఎం షేర్ హోల్డర్లలో పెద్ద అలజడి మెుదలైంది. చాలా మంది పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయించేందుకు ఎగబడ్డారు మదుపర్లు.