30 September 2023

టాపప్‌తో ఆరోగ్య బీమాకు అదనపు రక్ష..

టాపప్‌తో ఆరోగ్య బీమాకు అదనపు రక్ష అందించండి. ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది 

సాధారణంగా కుటుంబం మొత్తానికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నా అనుకోకుండా ఆసుపత్రిలో చేరాల్సి వస్తే టాపప్‌ సాయపడుతుంది.

టాపప్‌ పాలసీలు ఆసుపత్రిలో అయిన ఖర్చులతోపాటు, అంబులెన్స్‌, అవయవ దాత ఖర్చులు, రెండో వైద్య అభిప్రాయం తదితర ఖర్చులకూ వర్తిస్తుంది.  

ప్రాథమిక ఆరోగ్య పాలసీ మొత్తం పూర్తయిన సందర్భాల్లో టాపప్‌ ప్లాన్‌లు అదనపు రక్షణ అందిస్తాయి. 

ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎవరూ ఊహించలేరు. ఖర్చు ఎంతవుతుందన్నదీ చెప్పలేం. కాబట్టి, వీలైనంత అధిక మొత్తానికి రక్షణ ఉండటమే పరిష్కారం.

అలా అని పెద్ద మొత్తంలో బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం భారంగా మారుతుంది. ఇక్కడే టాపప్‌ ప్లాన్‌లు అక్కరకు వస్తాయి. 

ప్రాథమిక పాలసీ ఖర్చయిన తర్వాతే ఈ టాపప్‌ పాలసీలు మిగతా మొత్తాన్ని భరిస్తాయి. 

సాధారణ ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే టాపప్‌లకు తక్కువ ప్రీమియం వర్తిస్తుంది.