29 October 2023
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ79 5జీ (Oppo A79 5G) ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
50-మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోంది.
అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, మెటాలిక్ లైక్ టెక్చర్‌తోపాటు పాలికార్బోనేట్ ఫ్రేమ్‌తో తయారైంది ఈ ఫోన్.
ఒప్పో ఏ79 5జీ ఫోన్ రూ.19,999లకు లభిస్తుంది. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ ఒప్పో ఏ79 5జీ స్మార్ట్ ఫోన్ మిస్టరీ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
దీపావళి పండుగ నేపథ్యంలో ఒప్పో తన స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది
ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, కోటక్ మహీంద్రా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్, వన్ కాడ్స్‌పై రూ.4000 వరకూ క్యాష్ బ్యాక్
ఒప్పో ఏ79 5జీ ఫోన్ ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. 8జీబీ ర్యామ్